Success message
Error message
WELCOME TO
07-Feb-2026
By Sister. Diana
Our relationship with God.
How to stay close to God during the last days.
1 అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?
2 మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు
3 భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.
4 ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు
5 ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును
6 నేను నా పరిశుద్ధపర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను
7 కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను –నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను.
8 నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.
9 ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు
10 కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా, బోధనొందుడి.
11 భయభక్తులుకలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి.
12 ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.
By Kavya Sister
18 యోహాను శిష్యులు ఈ సంగతులన్నియు అతనికి తెలియజేసిరి.
19 అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి–రాబోవువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా? అని అడుగుటకు వారిని ప్రభువు
20 ఆ మనుష్యులు ఆయనయొద్దకు వచ్చి –రాబోవువాడవు నీవేనా? లేక మరియొకనికొరకు మేము కనిపెట్టవలెనా? అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీయొద్దకు పంపెనని చెప్పిరి.
21 ఆ గడియలోనే ఆయన రోగములును, బాధలును, అపవిత్రాత్మలునుగల అనేకులను స్వస్థపరచి, చాలమంది గ్రుడ్డివారికి చూపు దయ చేసెను.
22 అప్పుడాయన–మీరు వెళ్లి, కన్నవాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపుపొందు చున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రక టింపబడుచున్నది;
23 నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను.
దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2) ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2) ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2) స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| సన్న తంతుల సితారతోను (2) చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| తంబురతోను నాట్యముతోను (2) తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| పిల్లనగ్రోవుల చల్లగనూది (2) ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2) గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2) హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| ఎన్ని కష్టాలు కలిగిననూ నన్ను కృంగించె భాదలెన్నో (2) ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించినా (2) పలు నిందలు నను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| మణి మాన్యాలు లేకున్ననూ పలు వేదనలు వేధించినా (2) నరులెల్లరు నను విడచినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| బహు వ్యాధులు నను సోకినా నాకు శాంతి కరువైనా (2) నను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరూ (2) నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను (2) ||యేసే నా||
దేవా నీ నామం బలమైనది నీ నామం (2) స్తుతియింతును నీ నామం ఘనపరతును నీ నామం (2) అన్నిటి కన్న పై నామం యేసయ్యా నీ నామం (2) ఆశ్రయ దుర్గము నీ నామం నా కొండా నా కోట (2) స్తుతియింతును నీ నామం ఘనపరతును నీ నామం (2) అన్నిటి కన్న పై నామం యేసయ్యా నీ నామం (4)
O Lord my God When I in awesome wonder Consider all the works Thy hands have made, I see the stars, I hear the rolling thunder, Thy pow'r throughout The universe displayed! Chorus Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art! Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art! Verse 2 When thru the woods And forest glades I wander And hear the birds Sing sweetly in the trees, When I look down From lofty mountain grandeur And hear the brook And feel the gentle breeze, Chorus Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art! Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art! Verse 3 And when I think That God, His Son not sparing, Sent Him to die, I scarce can take it in - That on the cross, My burden gladly bearing, He bled and died To take away my sin! Chorus Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art! Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art! Verse 4 When Christ shall come With shout of acclamation And take me home, What joy shall fill my heart! Then I shall bow In humble adoration And there proclaim, My God, how great Thou art! Chorus Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art! Then sings my soul, My Savior God, to Thee; How great Thou art, How great Thou art!
నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి
Acts 18: 1 - 3
1 అటుతరువాత పౌలు ఏథెన్సునుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను.
2 యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీనుండి క్రొత్తగా వచ్చినవారు.
3 వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి.
4 అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను.
18 పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి
25 అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మముమాత్రమే తెలిసికొనిన వాడైనను, యేసునుగూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించుచు, సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను.
26 ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి
Romans 16: 3 - 5
3 క్రీస్తుయేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి.
4 వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.